Saturday, 31 October 2026 02:03:22 AM
# జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం # హైదరాబాద్ లో 25KGల బ్యాగులో 22 KGల బియ్యం..!! # ఉద్యోగానికి ఎంపికై ఆరు నెలలు అయినా నియామక ఉత్తర్వులు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం..!! # 20 వేల లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్ అరెస్ట్..!" # ఢిల్లీ వేదికగా 12వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు..!! # రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..!! # రేషన్ లబ్ధిదారులకు మరో 6 నిత్యావసరాలు..? # రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని... మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. # సైనిక్ పురిలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు..!! # హైదరాబాద్లో ఆల్ ఇండియా పోలీస్ T20 క్రికెట్ టోర్నీ..!!

పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..?

Date : 30 October 2026 02:04 PM Views : 13

DNB News - తెలంగాణ / : దీపావళి పండుగ వేళ మిఠాయిల కొనుగోళ్లతో సందడిగా మారిన భాగ్యనగరంలో ఆహార భద్రతా ప్రమాణాలు దారుణంగా దిగజారిన వైనం బట్టబయలైంది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరవ్యాప్తంగా చేపట్టిన మెరుపు తనిఖీల్లో ప్రముఖ స్వీట్ బ్రాండ్ జి. పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ ప్రధాన తయారీ కేంద్రంలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేలా ఉండటంతో సదరు యూనిట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయించారు. పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో అధికారులు జరిపిన సోదాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతున్నట్లు తేలింది. స్వీట్లు తయారు చేసే ప్రధాన వంటగది, వాషింగ్ ఏరియాలు అత్యంత మురికిగా ఉండటమే కాకుండా.. ముడిసరుకులు నిల్వ చేసే స్టోరేజ్ గదుల్లో ఎలుకల మలం, విచ్చలవిడిగా తిరుగుతున్న క్రిమికీటకాలు, కుళ్ళిపోయిన కూరగాయలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సరైన కేటగిరీ కింద లైసెన్స్ తీసుకోకపోవడం, తయారీ గడువు ముగిసిన నిల్వలను ఉంచడం, తప్పుడు లేబుళ్లతో కూడిన పదార్థాలను ఉపయోగించడం వంటి తీవ్ర ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో సుమారు రూ. 15.03 లక్షల విలువైన 3,133 కిలోల అనుమానాస్పద ఆహార పదార్థాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికక్కడే సీజ్ చేశారు. కేవలం పుల్లారెడ్డి స్వీట్స్‌కే పరిమితం కాకుండా.. 13 ప్రత్యేక బృందాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం మరో నాలుగు ప్రముఖ సంస్థల లైసెన్సులను సైతం రద్దు చేసింది. చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్, కాటేదాన్‌లోని మినర్వా స్వీట్స్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్‌ల లైసెన్సులను సస్పెండ్ చేసి తయారీని నిలిపివేశారు. అలాగే తిమ్మాపూర్‌లోని ప్రసిద్ధ కరాచీ బేకరీ ఇంటర్నేషనల్ యూనిట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు.. కనీస లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రంగా నడుస్తున్న చంపపేట్ బాలాజీ స్వీట్స్, సికింద్రాబాద్ మమతా స్వీట్ హౌస్ సహా మరో 5 తయారీ కేంద్రాలను పూర్తిగా మూసివేయించారు. ఈ దాడుల సందర్భంగా మొత్తం 22 రకాల స్వీట్ శాంపిళ్లను సేకరించిన అధికారులు, రసాయనాలు , కల్తీని గుర్తించేందుకు ప్రభుత్వ ల్యాబ్ పరీక్షలకు పంపించారు. లాభాపేక్షతో ప్రముఖ బ్రాండ్ల పేరిట నాసిరకం, అనారోగ్యకరమైన నూనెలు, రసాయన రంగులతో మిఠాయిలు తయారు చేసి విక్రయిస్తే ఎంతటి పెద్ద సంస్థలైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఫుడ్ సేఫ్టీ విభాగం హెచ్చరించింది..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :