Sunday, 20 September 2026 07:16:20 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కర్ణాటకలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

Date : 17 March 2026 03:52 PM Views : 100

DNB News - తెలంగాణ / : కర్ణాటకలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన కేవలం 60 రోజుల్లోనే భర్తను హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన టిప్టూరు గ్రామీణ ప్రాంతంలోని చిక్కకోట్టగిహళ్లి వద్ద చోటుచేసుకుంది. మృతుడు మన్‌సూర్ పాషా (31)… స్క్రాప్ వ్యాపారి. మార్చి 4న స్క్రాప్ సేకరించేందుకు వెళ్లిన మన్‌సూర్… అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు. తర్వాత అతని మృతదేహం తోటలో లభించింది. ఈ కేసులో పోలీసులు మన్‌సూర్ భార్య ఫర్ఝానాతో పాటు… ధనరాజ్, వెంకటేష్, దర్శన్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఫర్ఝానాకు ధనరాజ్‌తో గత 7 నెలలుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి వివాదం రావడంతో… ఈ ఏడాది జనవరిలో ఫర్ఝానాకు మన్‌సూర్‌తో వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా ఫర్ఝానా… ధనరాజ్‌తో రహస్యంగా సంబంధం కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికోసం కొత్త సిమ్ కార్డు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి మన్‌సూర్‌ను తొలగించేందుకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 4న దర్శన్ సహాయంతో… స్క్రాప్ ఉందని చెప్పి మన్‌సూర్‌ను పిలిపించి… కార్ షాక్ అబ్జార్బర్‌తో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై చిక్కమగళూరు సహా పలు ప్రాంతాల్లో పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపి… నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగా… కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: