DNB News - తెలంగాణ / : గిరిజనుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, ITDA PO రాహుల్ (IAS) చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంగా “భద్ర గిరి మార్ట్” రేపు భద్రాచలంలో ప్రారంభం కానుంది. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ మార్ట్‌ను ఏర్పాటుచేశారు. ఈ మార్ట్‌లో గిరిజనుల చేతుల మీదుగా తయారైన Pure Tribal Products వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులను చేరవేయడం ద్వారా గిరిజనులకు న్యాయమైన ధరలు అందేలా ఈ ప్రణాళిక రూపొందించబడింది. గిరిజన జీవనోపాధిని బలోపేతం చేయడం, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ భద్రగిరి మార్ట్‌ను సందర్శించి గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి సహకరించాలని ITDA PO రాహుల్ (IAS) కోరారు. భద్ర గిరి మార్ట్ గ్రాండ్ ఓపెనింగ్ రేపు (27.03.2026) జరగనుంది. అడ్రస్ : పాత కూరగాయల మార్కెట్ దగ్గర,Opposite Red Bucket, భద్రాచలం.
Admin
DNB News