Saturday, 01 August 2026 09:52:58 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అశ్వారావుపేట మునిసిపల్ లో 11 వార్డుల యుద్ధం సిద్ధాంతాల కంటే 'సీట్ల'కే పెద్దపీట

Date : 23 January 2026 11:59 AM Views : 154

DNB News - తెలంగాణ / : అశ్వారావుపేట రాజకీయం ఇప్పుడు ఒక రసవత్తర మలుపులో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట,మున్సిపాలిటీ పీఠంపై జెండా పాతాలని తహతహలాడుతున్న పార్టీలకు 'అంతర్గత పోరు' ఒకవైపు, 'పొత్తుల సందిగ్ధత' మరోవైపు సవాలుగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి వర్గీయులకు, పాత కాంగ్రెస్ నేతలకు మధ్య జరుగుతున్న '11 వార్డుల యుద్ధం' కేవలం సీట్ల గొడవ మాత్రమే కాదు, అది ఉనికి చాటుకునే పోరాటం. పాత తరం నాయకులను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో గత ఎన్నికలు పాఠాలు నేర్పినప్పటికీ, ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు. ​ మరోవైపు, ప్రతిపక్షాల పరిస్థితి 'శత్రువుకు శత్రువు మిత్రుడు' అన్న చందంగా మారింది. బలమైన కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధాంతాలను పక్కనబెట్టి బిఆర్ఎస్, టిడిపి, జనసేన, బిజెపి లు ఏకతాటిపైకి వస్తాయా అన్నది వేచి చూడాలి. వీటన్నింటి మధ్య తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఎంట్రీ కొత్త సమీకరణాలకు తెరలేపింది. రాజకీయాలు అంటే కేవలం పార్టీలు మాత్రమే కాదు, ఒక వ్యక్తిని లేదా ఒక వర్గాన్ని అడ్డుకోవడానికి పార్టీలకు అతీతంగా నాయకులు ఏకం కావడం ఇక్కడ విశేషం. ఈ 'స్ట్రాటజిక్ ఓటింగ్' లేదా 'సీక్రెట్ అలయన్స్' అశ్వారావుపేట భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. ఇది కేవలం ఎన్నిక కాదు, అశ్వారావుపేట రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అగ్నిపరీక్ష. అశ్వారావుపేట మున్సిపల్ సమరం - 2026 ఎవరిది పైచేయి? ఎవరిది వ్యూహం? కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల గుప్పిట్లో హస్తం.. పాత-కొత్త నేతల మధ్య వార్డుల యుద్ధం బిఆర్ఎస్ పొత్తుల కోసం పావులు. టిడిపి, జనసేనతో దోస్తీ కుదిరేనా? జనసేన - బిజెపి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న శ్రేణులు ఒక బలమైన వర్గానికి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు రాజకీయ రంగుల విందు.. అశ్వారావుపేట ఎన్నికల పొందు! నిర్ణయం ఓటరుదే.. తీర్పు ప్రజలదే!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: