DNB News - తెలంగాణ / : నిషేధిత CPI (Maoist) పార్టీకి చెందిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ రోజు రాష్ట్ర డీజీపీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పొలిట్ బ్యూరో సభ్యుడు (PBM) తిపిరి తిరుపతి @ దేవుజి @ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) మల్ల రాజి రెడ్డి @ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కా రావు @ దామోదర్ @ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) నూనె నర్సింహ రెడ్డి @ గంగన్న @ సన్ను దాదా ఉన్నారు. దాదాపు మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో పనిచేసిన ఈ నాయకులు ప్రధాన జనజీవన స్రవంతిలో చేరడం రాష్ట్రంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా బడే చొక్కా రావు మరియు నూనె నర్సింహ రెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్వీర్యమైందని పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలోపేతం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Admin
DNB News