DNB News - తెలంగాణ / : గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 25 నుంచి 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్-2026 నిర్వహించనున్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆహ్వానించారు. లోకభవన్లో గవర్నర్ను కలిసి టోర్నీ వివరాలను డీజీపీ వివరించారు. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర భద్రతా బలగాల జట్లు ఇందులో పాల్గొననున్నాయి.
Admin
DNB News