Monday, 03 August 2026 12:38:10 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి

Date : 23 January 2026 05:17 PM Views : 101

DNB News - తెలంగాణ / : కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేనేలేదు చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ముడుపులు దండుకునేందుకు విచారణ పేరుతో సాగదీతలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి పోలీసులే విచారణ సందర్భంగా నాకు ఆధారాలు, సాక్షాలు చూపారు అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా? మా కార్యకర్తలను కొట్టి హింసించి అడుగడుగునా వేధించిన ద్రుశ్యాలు ఇంకా నా కళ్లముందే కన్పిస్తున్నాయి నాడు కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తే మా రక్తం మరుగుతోంది మేం అధికారంలోకి వచ్చి ఉంటే.... కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పే వాళ్లం రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు... చేవ చచ్చిపోయింది అధికారంలో ఉంటూ కోట్లు దండుకోవడంపైనా కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వండి వాళ్లపై జులుం ప్రదర్శిస్తే విచారణ నుండి తప్పుకునే ప్రమాదముంది బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచకాలపై చర్యలు తప్పవు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు కేటీఆర్ అరాచకాలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ తోపాటు అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుండి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్షాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్షాలను సైతం చూపించారని తెలిపారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోపాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏమన్నారంటే... ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ టీవీ సీరియల్ ను మించి ఆది అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. నిజానికి సిట్ అధికారులు సమర్ధులు, నిజాయితీపరులు. కానీ వాళ్లపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది. ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్లనే పిలిచి విచారణ చేస్తున్నారు.నేనడుగుతున్నా.. కేటీఆర్ ను ఎందుకు విచారణకు పిలిచారు? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా? లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా? సిరిసిల్ల కేంద్రంగా వార్ రూంను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను చాలా సార్లు చెప్పిన. యువరాజు కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారు. బ్రిటీష్ పాలన తరహాలో పాలన చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారు. నా ఫోన్లను, ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోన్లతోపాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసింది. అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడమేంటి? రెండేళ్ల విచారణలో సిట్ సాధించిందేమిటి? ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? ఎన్ని ఆస్తులు జప్తు చేశారు? ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?... స్వయంగా కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. మాజీమంత్రి హరీష్ రావు ఆ టైంలో ఏడాదిపాటు ఫోన్ కూడా వాడలేదు. ఇన్ని సాక్షాలు, ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఫోన్ ఉన్నా వాట్సప్ కాల్ లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దారుణానికి దొంగలను పిలిచి ‘మీ ఫోన్ ట్యాప్ చేశారా?’అని విచారణకు పిలవడం ఏంది?అసలు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైం పాస్ విచారణ చేస్తున్నారు. సిట్ అధికారులు మంచి అధికారులు. వాళ్లకు స్వేచ్ఛనిచ్చి విచారణ జరిగేలా చూడాలి. అట్లా కాకుండా ప్రభుత్వ వ్యవహారశైలికి విసిగిపోయి సిట్ నుండి తప్పుకునే ప్రమాదముంది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :