Friday, 18 September 2026 08:10:27 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది

Date : 23 April 2026 02:12 PM Views : 92

DNB News - తెలంగాణ / : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు హైకోర్టు తీర్పే సరైన సమాధానం కమిషన్ పేరుతో కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బ తీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టిన హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి తక్షణమే కెసిఆర్ కు క్షమాపణలు చెప్పాలి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ DNB న్యూస్ ఛానల్ కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ * మునగాల, ఏప్రిల్ 23 తెలంగాణ రాష్ట్ర వరదప్రదాయిని గా పేరుగాంచిన కాలేశ్వరం ప్రాజెక్టుని నిర్మాణం చేసిన నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ అవినీతి ఆరోపణలతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని నియమించి, కమిషన్ రిపోర్టు సహాయంతో సిబిఐ విచారణకు ఆదేశించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులను జైలుకు పంపాలన ఏకైక ఉద్దేశంతో తన అధికారాన్ని ఉపయోగించి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర కోణాన్ని నేడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు న్యాయపరంగా విచారించి పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ప్రాథమిక సూత్రాలను అనుసరించలేదని, ఈ కమిషన్ నివేదికతో నాటి ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని కావున తక్షణమే పిసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారాలతో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదని ఆదేశాలు ఇవ్వడం హర్షణీయమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ అన్నారు, బుధవారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని తద్వారా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నాటి ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్వరరావు, మరియు ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలులేదని హైకోర్టు తీర్పునివ్వడంతో కెసిఆర్, హరీష్ రావు పై గత రెండున్నరెండ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో చేస్తున్న కుట్ర కోణాన్ని న్యాయస్థానం పటాపంచలు చేసిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను పక్కనపెట్టి హుందాగా పరిపాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రధాయినిగా పేరుగాంచిన కాలేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అసత్య ఆరోపణలను వెనక్కు తీసుకొని తక్షణమే ప్రాజెక్టునందు ధ్వంసం అయిన రెండు పిల్లర్లకు మరమతులు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు సాగునీళ్లు, తాగునీళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన హితువు పలికారు, తమపార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, హరీష్ రావు పై కావాలని ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్ని రకాలుగా దాడి చేసిన చివరికి న్యాయమే గెలిచిందన్నారు, నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు సాగునీళ్లు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించిన కేసీఆర్ హరీష్ రావు అంకుటితో దీక్షతోనే దేశంలోనే వరి ధాన్యం పండించిన ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించిన విషయాన్ని విస్మరించిన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానంలో కూడా ఎదురు దెబ్బ తప్ప లేదన్నారు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ హరీష్ రావు లు పడిన కష్టానికి మరియు ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆరోపణలపై నేడు న్యాయస్థానంలో కడిగిన ముత్యంలో కేసీఆర్, హరీష్ రావులు ప్రజాక్షేత్రంలో నిలవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన తెలిపారు, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే కెసిఆర్ కు హరీష్ రావు లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, మునగాల మాజీ పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :