Monday, 02 November 2026 05:28:14 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

అక్రమ సంబంధం ఎఫెక్ట్... ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

Date : 23 February 2026 12:15 PM Views : 140

DNB News - తెలంగాణ / : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య భార్య రాజేశ్వరి, ప్రియుడు శరత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35), జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం రాజేశ్వరికి శరత్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కృష్ణను అడ్డు తొలగించుకోవాలని రాజేశ్వరి, శరత్ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవపడింది. అతను నిద్రలోకి జారుకున్నాక, ప్రియుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం శరత్ అతని ఛాతీపై బలంగా కొట్టడంతో కృష్ణ మృతి చెందాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్లు నటించిన రాజేశ్వరి, శుక్రవారం ఉదయం తన భర్త పలకడం లేదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతని తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరిని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: