DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మండవ చంద్రయ్య, పుట్టినరోజు సందర్భంగా ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకులు వృద్ధాశ్రమంలో పంపిణీ చేసి ఈ సందర్భంగా మండవ చంద్రయ్య మాట్లాడుతూ, నాపుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకులు అందజేయడం చాలా ఆనందంగాఉందని,దాతలు ముందుకు వచ్చి వృద్ధాశ్రమానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు,ఈకార్యక్రమంలో ఆశ్రమనిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మందపల్లి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News