DNB News - తెలంగాణ / : తెలంగాణ వడ్డెర సంఘం & చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు గారి ఆదేశాల మేరకు భావితరాల వడ్డెర బిడ్డల భవిష్యత్తు కోసం ఈ నెల 17-05-2026 ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ట్యాంక్‌బండ్ కింద ఉన్న ధర్నా చౌక్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు మునగాల మండల అధ్యక్షులు గోగుల లక్ష్మణ్ తెలిపారు. వడ్డెర కుల అభివృద్ధిలో భాగస్వాములై నిరంతరం కృషి చేసిన వడ్డెర సంఘ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి వడ్డెర సంఘ నాయకులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
Admin
DNB News