DNB News - తెలంగాణ / : ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లి గ్రామంలోని తెల్దార్ పల్లి సబ్ -సెంటర్ నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ముఖ్య అతిథిగా హాజరైన మద్దులపల్లి 17 వ వార్డ్ కౌన్సిలర్ గొడ్డుగొర్ల కృష్ణకుమారి మాట్లాడుతూ డిజిటల్ ఎక్స్ రే మిషన్ ద్వారా ఛాతి నిర్ధారణ టీబి అనుమానిత కేసులను కనుక్కోవడం జరుగుతుందని,అలాగే తెమడ నమూనాలు సేకరించడం జరిగిందని , ఒకవేళ పరీక్ష ద్వారా నిర్ధారణ అయితే మందులు వెంటనే ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తారని తెలియజేశారు.అలాగే గ్రామంలోప్రతి ఒక్కరు టీబి రహిత గ్రామంగా తీర్చిదిద్దే విధంగా గ్రామ ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ప్రజల అందరి సహకారం కావాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించడానికి, శ్రమించిన మన గ్రామానికి చెందిన మెడికల్ ఆఫీసర్ గొడ్డుగొర్ల ఉపేందర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు సుగుణ వి. ఓ. ఎ,జిల్లా క్షయ నివారణ సిబ్బంది మరియు సబ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
DNB News