Tuesday, 03 November 2026 01:47:55 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేసే వరకు పోరాటం కొనసాగిస్తాం.

Date : 08 April 2026 04:28 PM Views : 97

DNB News - తెలంగాణ / : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏప్రిల్ 8న ప్రతిజ్ఞ దినంగా పాటించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టి యు)జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఇల్లెందు బుగ్గవాగు సమీపంలోని భగత్ సింగ్ సెంటర్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి,రాష్ట్ర సహాయకార్యదర్శి ఎం.డి.రాసుద్దిన్ మాట్లాడుతూ 1929 ఏప్రిల్ 8న బ్రిటిష్ పార్లమెంటు‌లో షహిద్ భగత్‌‌ సింగ్‌,బట్కేశ్వర్ దత్తులు ‌పొగబాంబు‌లు వేశారని,బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశంలో కార్మిక పోరాటాలను, ప్రజాపోరాటాల‌ను అణి‌చివేసేందుకు నిర్బంధ చట్టాలను ప్రవేశపెట్టిన సందర్భంగా బాంబులను విసిరి బ్రిటిష్ వారిని గడగడలాడించారని అన్నారు.నేడు దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ పిడికెడు మంది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం,పెట్టుబడిదారుల సంపద పెంపు కోసం 50కోట్లమంది కార్మికుల రక్త మాంసాలను దోచి పెట్టేందుకు 29కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు.కామ్రేడ్స్ షహీద్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తుల స్ఫూర్తితో కార్మికవర్గం లేబర్ కోడ్ లను రద్దుచేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కొప్పుల శ్రీనివాస్,నరాటి వెంకన్న,రామిశెట్టి నరసింహారావు,తొగర సామెల్,పల్లి సుధాకర్,బి.లాలు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :