Thursday, 17 September 2026 04:35:00 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఏసీలోంచి బయటపడ్డ ఐదు పాములు … షాక్‌కు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Date : 07 March 2026 04:09 PM Views : 114

DNB News - తెలంగాణ / : కేరళలో ఓ ఇంట్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న ఏసీ నుంచి ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఐదు పాములు బయటపడటంతో ఇంటి యజమాని తీవ్రంగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… Sreekaryam, Thiruvananthapuram ప్రాంతంలో మాధవ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నివసిస్తున్నాడు. ప్రతిరోజులానే కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన మాధవ్ ఫ్రెష్ అయ్యేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అయితే గోడకు అమర్చిన ఏసీ కింద ఏవో కదులుతున్నట్టు కనిపించడంతో దగ్గరగా వెళ్లి పరిశీలించాడు. అప్పుడు ఏసీ నుంచి చిన్న చిన్న శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చిన మాధవ్ ఒక కర్రతో కాస్త జరిపి చూసాడు. దీంతో ఏసీ లోపల పాములు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఫోన్ ద్వారా సర్ప యాప్ ద్వారా స్నేక్ క్యాచర్ మరియు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని ఏసీ టెక్నీషియన్ సహాయంతో ఏసీ కవర్‌ను తెరిచి పరిశీలించగా లోపల ఐదు పాములు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దాదాపు గంటకు పైగా శ్రమించి ఏసీ లోపల ఉన్న నాలుగు పాములను బయటకు తీశారు. అయితే మరో పాము ఏసీ పైప్ ద్వారా బయటకు వెళ్లిపోయినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :