DNB News - తెలంగాణ / : *గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తిరిగి కరీంనగర్‌కు మార్చాలి *అసోసియేషన్ అధ్యక్షులు పాశం మోహన్ రెడ్డి డిమాండ్ కరీంనగర్ టౌన్, మే24( డి ఎన్ బి న్యూస్)కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ విజయలక్ష్మి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ పరిధిలోని రియల్టర్లు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పాశం మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెస్ట్ జోన్ రియల్టర్ల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రియల్టర్లకు వ్యాపార పరంగా లేదా ఇతరత్రా ఏ రకమైన సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటినీ ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రజల ఇబ్బందులను గుర్తించాలి.ప్రస్తుతం గంగాధరలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వల్ల కరీంనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న రిజిస్ట్రేషన్ పని కోసమైనా ప్రజలు దాదాపు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సుదూర ప్రయాణం వల్ల ప్రజలపై సమయం, ధనం వృధా అవుతున్నాయని తెలిపారు.కావున, ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు స్పందించి, గంగాధరలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తక్షణమే తిరిగి కరీంనగర్ నగర పరిధిలోకి మార్చాలని లేదా ఇక్కడే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తిరుణగారి రవీందర్,కోశాధికారి ఆకుల కృష్ణ,ప్రెసిడెంట్ సుర సురేందర్,వైస్ ప్రెసిడెంట్ బండి భూమయ్య,అందె శ్యామ్ సురేందర్,పచ్చునూరి నరేందర్,కందల మధుసుధన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రియల్టర్లు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News