DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ మాట్లాడుతూ....తమిళనాడు రాజకీయాల్లో తాజాగా దళిత ముఖ్యమంత్రి అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ పేరు చుట్టూ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. అనతి కాలంలోనే ఓ దళితుడు పార్టీని స్థాపించి ప్రజల మద్దతుతో 108 స్థానాలు స్థాపించిన జోసెఫ్ విజయ్ ఆయన రాజకీయ ప్రవేశం తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో “దళిత నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి” అనే డిమాండ్ మరింత బలపడుతోంది. ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మందడి ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించారు , “ఒక దళిత నాయకుడు ప్రజాదరణతో ముందుకు వస్తే కొన్ని రాజకీయ శక్తులు భయపడుతున్నాయి. దళితుడు సీఎం అవుతాడనే ఆలోచనే కుల ఆధిపత్య వర్గాలను కలవరపెడుతోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రజా తీర్పుకు అనుగుణంగా వ్యవహరించవలసిన గవర్నర్ తీరును నిరసిస్తూ జోసఫ్ విజయ్ ని వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని ఈ సందర్భంగా కోరినారు. తమిళనాడు రాజకీయాలతో మళ్లీ మొదలైన కుల రాజకీయాలపై మళ్లీ చర్చ భారత రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాలుగా కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిసిందే. అధికార కుర్చీల వద్దకు వచ్చే సమయంలో సామాజిక వర్గాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చదువుకున్న యువత, సామాజికంగా చైతన్యవంతమైన వర్గాలు “ప్రతిభకు అవకాశం కావాలి కానీ కులానికి కాదు” అని గళమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జోసెఫ్ విజయ్ పేరు చుట్టూ ఏర్పడుతున్న రాజకీయ చర్చ దళిత వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. “ప్రజల మద్దతు ఉంటే దళితుడూ సీఎం కావచ్చు” అనే నమ్మకం బలపడుతోందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. దళిత నాయకత్వం ఎదిగితే ఎందుకు భయం.....? దళిత వర్గాలు రాజకీయంగా చైతన్యం సాధిస్తే సంప్రదాయ రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే భయం కొందరిలో ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అణగారిన వర్గాలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని, కానీ నాయకత్వ స్థాయికి తీసుకురావడంలో వెనుకంజ వేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళిత నాయకత్వం పై చిన్న చూపు ఎందుకు.....? “దళితుల ఓట్లు కావాలి కానీ దళిత నాయకత్వం వద్దు అనే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలు ఎవరిని కోరుకుంటే వారి నాయకత్వాన్ని బలపరిచి వారికి పట్టం కడితే రాజ్యాంగబద్ధంగా వారు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కుని ప్రజలపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిన వారు అవుతారు కానీ ఇప్పటి రాజకీయాలు కొన్ని పార్టీలుకు తొత్తుగా మారి వారే నాయకత్వం వహించాలి” అన్నట్లుగా వివరిస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. రాజకీయాల్లో కొత్త సమీకరణాలా....? జోసెఫ్ విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత యువత, మధ్యతరగతి, సామాజిక న్యాయం కోరే వర్గాలు ఆయన వైపు ఆకర్షితమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దళిత సీఎం అంశం ఇప్పుడు కేవలం ఒక నినాదంగా కాకుండా సామాజిక సమానత్వంపై జరుగుతున్న పెద్ద చర్చగా మారింది. “అవకాశం వస్తే దళిత నాయకత్వం కూడా రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించగలదు” అనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ చర్చ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈకార్యక్రమం లో కాంగ్రెస్ జిల్లా నాయకులు మందడి ఇజ్రాయల్, , చీమ లక్సయ్య , దొడ్డి సాంబయ్య, స్వేరో నెట్వర్క్ జిల్లా నాయకులు చీమా భూపాలం , మండల నాయకులు ఇలాపొంగు వెంకన్న , మోహనరావు బి ఎస్ పి జిల్లా నాయకులు మట్టే. నాగేశ్వరావు, బానోత్ శంకర్ నాయక్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News