Tuesday, 04 August 2026 12:21:11 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

Date : 22 January 2026 04:06 PM Views : 217

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. పాల్వంచ డీఎస్పీ శ్రీ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు సమాజంపై బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి చేతుల్లోనే సమాజ మార్పు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులుగా మీరు ఎదుగుతూనే, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి వారధులుగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాకుండా, బాధ్యతాయుత జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు ఉపయోగపడాలని అన్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రత విషయంలో విద్యార్థులు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతతో ఎల్లప్పుడూ విధుల్లో నిమగ్నమై ఉండే డాక్టర్లు, పోలీస్ అధికారులు తమ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రశంసించారు. విద్యార్థులలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జీవితంలో సురక్షిత ప్రయాణం అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన అంశమని, వేగం కంటే గమ్యాన్ని క్షేమంగా చేరుకోవడమే నిజమైన విజయం అని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల ఎన్నో కుటుంబాలు అనాథలవుతున్నాయని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగుల్చుతుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన 10 రోజుల ప్రత్యేక ‘అరైవ్ అలైవ్’ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువత చురుగ్గా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే బలవుతుందని, చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారిస్తాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు శిక్షల కోసం కాదని, ప్రజల ప్రాణాల రక్షణ కోసమేనని వివరించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులలో కూడా ఈ అవగాహనను విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని అన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, పోలీస్ అధికారులు కలిసి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ఇతరులకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిజిపి సతీష్ కుమార్,సీఐ నాగరాజు,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్మల, అశ్వరావుపేట దమ్మపేట ఎస్సైలు యయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి,తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: