DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఓ ఎస్సై రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డీల్‌కు సంబంధించినగా ఇప్పటికే రూ.20 వేలు ఫోన్‌పే ద్వారా పంపించి, మిగిలిన రూ.80 వేలు మూడు రోజుల్లో ఇస్తామని మాట్లాడినట్టు చెబుతున్న స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ విషయంపై వివరాలు వెల్లడించేందుకు మీడియా ముందు వెళ్లిన ఆంగోత్ బాలకృష్ణ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు సమాచారం. వాస్తవాలు చెప్పడం నేరమా అంటూ బాలకృష్ణ దంపతులను వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
Admin
DNB News