DNB News - తెలంగాణ / : ఉపాధి హామీ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ నేడు మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో. 2026_ 2027 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఉపాధి హామీ పనులకు సంబంధించిన అవగాహన సమావేశం గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు మేట్లకు తగు సూచనలు చేస్తూ ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే పని చేసే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరిగే ఈ కార్యక్రమాన్ని జాబ్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారులు ఈ ఆర్థిక సంవత్సరంలో 125 రోజులపాటు పని దినాలు ఉపయోగించుకునే అవకాశం ఉందని. అలాగే దినసరి కూలి 307 చొప్పున పొందే అవకాశం ఉందని. అలాగే పని కోసం దరఖాస్తు చేసుకున్న. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి . అవసరమైన పని దినాలు కల్పిస్తామని ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల జాబితా సిద్ధం చేశామని. రెండు మూడు రోజుల్లో .. పనులు ప్రారంభమవుతాయని. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క గ్రూపుకు ప్రాధాన్యత క్రమంలో పని కల్పిస్తామని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఫీల్డ్ అసిస్టెంట్ ముత్తయ్య గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు మేట్లు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News