Monday, 02 November 2026 11:57:52 PM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

హైదరాబాద్ నగరంలోని IMD కార్యాలయానికి బాంబు బెదిరింపు

Date : 06 March 2026 03:41 PM Views : 114

DNB News - తెలంగాణ / : 14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చిన IMD సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించి, బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిని తనిఖీ చేస్తున్న పోలీసులు ఇటీవల ఎయిర్ పోర్ట్స్, స్కూల్స్,కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ వచ్చింది. విషయం తెలిసిన ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు పరుగులు తీశారు. వాతావరణశాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.వాతావరణ శాఖ కేంద్ర దగ్గ పోలీసులు భారీగా మోహరించారు. ఆకతాయిల పని కావొచ్చని భావిస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా క్షణ్ణంగా కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు,ప్రజలు టెన్షన్ పడొద్దని పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మెయిల్స్ పంపించింది ఆకతాయిలా? లేక ఏదైనా ఉగ్రవాద సంస్థనా? అనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇలాంటి బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం సాధారణమైపోయింది. అయినా పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :