DNB News - తెలంగాణ / : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులు, ఫస్ట్ లేడీ జానకి శుక్లాతో కలిసి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే శ్రీ పార్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం స్వీకరించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి మరియు దేశ ప్రగతి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, యాదాద్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవాని శంకర్, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తదితర అధికారులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.
Admin
DNB News