Sunday, 02 August 2026 12:26:04 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి

Date : 17 April 2026 06:03 PM Views : 58

DNB News - తెలంగాణ / : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని మరియు వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి‌నరేందర్ రెడ్డి వారి వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా మరియు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా అనేక సేవలు అందించారని మరియు వారి యొక్క పరిజ్ఞానంతో ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోరిన గొప్ప రాజనీతిఘ్నుడని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మరియు ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని విద్యార్థులకు ఎన్నో విధాలుగా సేవలను అందించి ఉత్తమమైన స్థానాలలో స్థిరపరచి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు‌ వారు చేసిన సేవలకు మరియు రూపొందించిన పథకాలకు భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించి మరియు వారి జన్మదిన ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని వారు చెప్పారు. వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్ గా పనిచేసి విద్యా మరియు జీవితం యొక్క ప్రాముఖ్యతను తన యొక్క మాటల ద్వారా తెలిపి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో విజయవంతులైనారని చెప్పవచ్చు. భారత రాయబారిగా ఆయన చేసిన సేవలు చాలా సమాజహితమైనవని, హిందూ వేదాంతాన్ని పాశ్చాత ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప తత్వవేత్తని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతర దేశాలకు రాయబారిగా పనిచేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని స్వస్తిరపరచి ఎన్నో సేవలు చేశారని వారు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని మరియు వారి శ్రమించిన తీరు చాలా ప్రేరేపించదగినదని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: