Friday, 17 April 2026 05:09:16 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

బచ్చోడులో ఆధ్యాత్మిక వైభవం.. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన

Date : 26 March 2026 03:40 PM Views : 24

DNB News - తెలంగాణ / : ​తిరుమలాయపాలెం : మండల పరిధిలోని బచ్చోడు గ్రామం బుధవారం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. గత మూడు రోజులుగా అత్యంత నిష్ఠతో నిర్వహిస్తున్న శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్ల సహిత శ్రీరామ లింగేశ్వర, కనకదుర్గమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం నాటి ప్రధాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ సముదాయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కోసం సోమవారం నుంచే వేద పండితులు శాస్త్రోక్తంగా జలధివాసం, ధాన్యధివాసం వంటి క్రతువులను నిర్వహించారు. ​సుముహూర్తాన ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చివరి రోజైన బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో హోమగుండాల నుంచి వెలువడిన వేద మంత్రోచ్ఛారణలు మారుమోగాయి. ఉదయం 6:30 గంటలకు వాస్తు పూజ, పంచలోహ నవరత్న స్థాపన, జీవం పోయుట వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఉదయం 9:50 గంటల సుముహూర్తాన విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఘట్టాలను కన్నులపండువగా నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య స్వామివార్ల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కావించడంతో భక్తుల జయజయధ్వానాలతో బచ్చోడు పులకించింది. ​ఈ కార్యక్రమంలో రామసహాయం నరేష్ రెడ్డి, రామసహాయం అరవింద్ రెడ్డి, హరిత రెడ్డి, బెల్లం శ్రీను, గండ్ర గోపాలరావు, కొప్పుల అశోక్, మంగీలాల్, ఉన్నం రాజశేఖర్, ఎన్.లింగయ్య, బి.సుదర్శన్, కరీం, వనవాసం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :