Monday, 16 March 2026 03:49:17 PM
# ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ # సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం ఆస్పత్రిలో చికిత్స

బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Date : 15 March 2026 10:49 AM Views : 9

DNB News - తెలంగాణ / : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాయకరావుపేటలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఈ వ్యవహారం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన బయటకు రావడంతో గురువారం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం… అనకాపల్లి జిల్లాకు చెందిన మైనర్ బాలికను తల్లిదండ్రులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివేందుకు చేర్పించారు. హాస్టల్‌లో ఉంటున్న ఆ బాలికకు తన స్నేహితురాలి ద్వారా చినగదిలికి చెందిన దల్లి సాయిచంద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ నిందితుడు తరచూ వేధింపులకు గురి చేశాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో బాలికను పాయకరావుపేట సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి విశాఖలోని పెందుర్తి ప్రాంతంలో తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి చివరి వారంలో కూడా బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని ఆమె తల్లిదండ్రులను ఫోన్‌లో బెదిరించినట్లు సమాచారం. బాలిక మైనర్ అని తెలిసినా నిందితుడి తల్లి కూడా ఆమెను నెల రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధించినట్లు పోలీసులు వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేక ఈ నెల 8న బాలిక నిందితుడి ఇంటి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో నిందితుడు తీసిన వీడియోలను బాధితురాలి తల్లిదండ్రులకు పంపడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి బంధువులకు కూడా పంపినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇదే విధంగా వీడియోలు తీసినట్లు విచారణలో బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దల్లి సాయిచంద్‌తో పాటు అతడి తల్లిని అరెస్టు చేశారు. కేసు పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :