Saturday, 01 August 2026 09:57:38 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆదోనిలో ఘనంగా అంతరాష్ట్ర 7-A సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – విజేతగా CFC ఆదోని..

Date : 18 May 2026 10:42 AM Views : 58

DNB News - తెలంగాణ / : ఆదోని పట్టణంలోని సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆదోని ఆధ్వర్యంలో “Sports for Unity” నినాదంతో ఈ నెల 15, 16 తేదీలలో నిర్వహించిన అంతరాష్ట్ర 7-A సైడ్ ఇన్విటేషనల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. మొత్తం 16 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ ఉత్కంఠభరిత పోటీలను అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో CFC ఆదోని జట్టు, విజయవాడ ఇజాక్ FC జట్టుతో తలపడగా అద్భుత ఆటతీరును ప్రదర్శించిన CFC ఆదోని జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విజేత జట్టుకు ట్రోఫీ, బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత క్రీడలను అలవర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ నిర్వహణలో సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆదోని అధ్యక్షుడు సైద్ సైఫుల్ల బాషా , కార్యదర్శి P. మస్తాన్ వలి , సంయుక్త కార్యదర్శులు S. జగన్నాథ్ , K. సురేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు, స్థానిక నాయకులు, యువకులు, టిడిపి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :