Friday, 18 September 2026 04:43:01 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పాల్వంచ జాతీయ రహదారిపై ‘మృత్యుకుప్ప’.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

Date : 04 April 2026 06:09 PM Views : 87

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ ఎదురుగా గల జాతీయ రహదారిపై అధికారుల బాధ్యతారాహిత్యం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. రోడ్డు మరమ్మత్తుల పేరుతో ప్రధాన రహదారిపై వదిలేసిన డాంబర్ కుప్ప ఇప్పుడు ప్రమాదాలకు పొంచి ఉన్న అపాయంగా మారింది. అసంపూర్తి పనులతో ప్రమాద ఘంటికలు జాతీయ రహదారి నుండి గొల్లగూడెం వెళ్లే దారి మధ్యలో తాత్కాలిక మరమ్మత్తుల కోసం అధికారులు డాంబర్ మిశ్రమంతో లెవెలింగ్ పనులు చేపట్టారు. అయితే, పని పూర్తయిన తర్వాత మిగిలిన డాంబర్ కుప్పను రోడ్డు పక్కకు తొలగించకుండా, ప్రధాన రహదారిపైనే వదిలేశారు. ఈ రహదారి గుండా నిత్యం పాఠశాల విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై, సైకిళ్లపై వెళ్తుంటారు. మలుపు వద్ద ఈ కుప్ప ఉండటంతో వేగంగా వచ్చే వాహనదారులు అదుపుతప్పి పడిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.. ఈ పనులు ఆర్ అండ్ బి (R&B) శాఖ ఆధ్వర్యంలో జరిగాయా లేక మున్సిపల్ శాఖ చేపట్టిందా అన్నది స్పష్టత లేనప్పటికీ, పని చేసిన కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "చిన్నపాటి నిర్లక్ష్యం ఒక కుటుంబానికి కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుంది. కనీస బాధ్యత లేకుండా రోడ్డుపై కుప్పలు వదిలేయడం అధికారుల అశ్రద్ధకు పరాకాష్ట." అని స్థానిక వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణ చర్యలకు డిమాండ్.. ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రహదారిపై ఉన్న డాంబర్ కుప్పను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకముందే అధికారులు మేల్కొని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :