DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) పిలుపుమేరకు భోజన సమయంలో బోధ నేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. డి ఎన్ బి న్యూస్ ఏప్రిల్ 17 కరీంనగర్ ప్రధాన డిమాండ్లు జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి. రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలు చేయాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి. పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ వై. కిషోర్, సూపరెంటెండెంట్ ఆర్. భీమయ్య, నరసయ్య, లచ్చయ్య, సంతోష్, సాయి, శ్రీకాంత్, యోజన, సంతోష్, శ్రీకాంత్, మాధురి, మారుతి, రాజ్ కమల్ సింగ్, లచ్చయ్య,సంజీవ్ కుమార్, ఇతర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు
Admin
DNB News