Thursday, 23 April 2026 04:11:20 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

అల్ఫోర్స్ ఐ.ఐ.టి అకాడమి తెలంగాణ మహారాష్ట్ర ఐఐటి జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో అల్ఫోర్స్ కు ర్యాంకుల పంట

Date : 22 April 2026 11:37 AM Views : 7

DNB News - తెలంగాణ / : పత్రికా ప్రకటన ఐఐటి జేఈఈ మెయిన్స్ - 2026 ఫలితాలలో అల్ఫోర్స్ కు ర్యాంకుల పంట నిన్న ప్రకటించబడిన ఐఐటి జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో మా అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలుపుటకు సంతోషిస్తున్నాను. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్. పూర్ణచంద్ 138, ఎస్. వర్జినిరెడ్డి 211, ఎన్. రత్నప్రకాశ్ 239, పి. అక్షయ 250, ఎ. కీర్తన 274, యు. సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్. వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం విశేషం. రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందముచే కోచింగ్ ఇవ్వబడును. పటిష్ట ప్రణాలికతో విద్యా భోధన మరియు నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల మరియు అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని ఈ సంధర్భముగా తెలియజేయుచున్నాను. రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో కూడ మా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి లలో సీట్లు సాధిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి సంవత్సరము ఐఐటీ నీట్ మరియు ఎంసెట్ పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఐఐటి జేఈఈ మెయిన్స్ - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను మన.స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతటి ఘన విజయమునకు తోడ్పడిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. పై విషయమును మీ పత్రిక ద్వారా ప్రజల దృష్టికి తీసుకవెళ్ళగలరు. వి. నరేందర్ రెడ్డి చైర్మెన్ అల్ఫోర్స్ విద్యాసంస్థలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :