DNB News - తెలంగాణ / : మావోయిస్ట్ అగ్ర నేత ముప్పల లక్ష్మన్న రావు అలియాస్ గణపతి ప్రస్తుతం అడవుల్లో లేడని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. తమకు ఉన్న నిఘా సమాచారం ప్రకారం గణపతి అడవుల్లో కాకుండా బయట ఎక్కడో ఒక షెల్టర్‌లో ఉన్నాడని డీజీపీ తెలిపారు. అయితే ఆయన ఉన్న ఖచ్చితమైన ప్రదేశంపై వివరాలు వెల్లడించలేదు. ఈ ప్రకటనతో భద్రతా వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్రంలో మావోయిస్ట్ కార్యకలాపాలపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Admin
DNB News