DNB News - తెలంగాణ / : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 84.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన వరంగల్ భద్రకాళి ట్యాంక్ బండ్‌తో పాటు రాణి రుద్రేమా ఐరన్ విగ్రహాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె.ఆర్. నాగరాజు గారు పాల్గొన్నారు... ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, భద్రకాళి దేవాలయం, విశాలమైన చెరువు, పద్మాక్షి మరియు సిద్దేశ్వరుల కొండలతో కలసి భద్రకాళి బండ్ పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. కుటుంబాలతో కలిసి నగర ప్రజలు ఆనందంగా గడిపే వినోద కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరానికి మణిహారంలా ఉన్న ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు... ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు, నగర మేయర్ గుండు సుధారాణి గారు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు, హనుమకొండ కలెక్టర్ మరియు ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్ గారు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు...
Admin
DNB News