Saturday, 19 September 2026 05:17:35 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కార్పొరేషన్‌లో కలకలం.. బదిలీ అయిన కమిషనర్‌ ఫైల్స్‌పై సంతకాలు

Date : 06 March 2026 12:01 PM Views : 108

DNB News - తెలంగాణ / : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్లకు బదిలీలు జరిగాయి. బదిలీ అయిన తర్వాత కమిషనర్లు వాళ్లకు కేటాయించిన మున్సిపల్ కేంద్రాలలో బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ జిల్లాలో ఓ కమిషనర్ తాను గతంలో పనిచేసిన కార్యాలయంలో పెత్తనం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లగొండ కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైల్స్ మీద సంతకాలు ప్రస్తుతం కూడా పెడుతున్నట్లు సమాచారం. నల్గొండ మున్సిపల్ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారోత్సవం రోజు మాజీ కమిషనర్ తన ఇంటి వద్దకు అటెండర్‌తో ఫైల్స్ తెప్పించుకొని సంతకాలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం కూడా రెండో దఫా సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒకరోజు సంతకం చేసిన తర్వాత అధికారి స్టాంపు వేయాల్సి ఉంటుంది. కానీ ఒకరోజు ఆ స్టాంపు కార్యాలయంలో ఎక్కడో మిస్ అయిందని ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంలో ఉన్న అధికారులు సిబ్బంది ఎంతో హడావిడి చేసినట్లు కార్యాలయంలో చర్చ జరిగింది. అయితే మరోసారి కూడా ఆయనతో సంతకాలు చేయించేందుకు అధికారులు ఫైల్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ ఫైల్స్ పూర్తిగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కాబట్టి కొత్త కమిషనర్ తోనే సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న కమిషనర్ అధికారికంగా ఏ ఫైల్ ని కూడా ముట్టుకోవడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న కమిషనర్ మరో రెండు నెలల్లో పదవీ విరమణ అవుతున్నట్లు సమాచారం. తర్వాత కూడా పాత కమిషనర్ ను నల్గొండకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆ కమిషనర్ తను అద్దెకు తీసుకున్న ఇంటిని కూడా ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్నట్లు సమాచారం

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: