DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని నల్గొండ క్రాస్ రోడ్డులో ఉన్న సోహైల్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి హోటల్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోహైల్ హోటల్‌ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదని హోటల్ యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అధికారుల చర్యలతో ప్రస్తుతం హోటల్ మూతపడింది..!!
Admin
DNB News