DNB News - తెలంగాణ / : శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి పేర్కొన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఖమ్మం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నందు శ్రీ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అశోక్, సోమ శ్రీనివాసరావు, వేముల యాకయ్య, పెద్ది శ్రీనివాస్ , ఎన్. బాలకృష్ణ , బి. విజయ్ కుమార్ , అనిశెట్టి లక్ష్మీనారాయణ , టి. రంగనాధ స్వామిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి మాట్లాడుతూ శ్రీ భగీరథ మహర్షి విశిష్టతను కొనియాడారు. సమాజ అభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిసి కుల సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News