DNB News - తెలంగాణ / : కారుకు దారి ఇవ్వలేదన్న కారణంతో ఓ దళిత వ్యక్తిపై దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కారుకు దారి ఇవ్వలేదని ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ శారద భర్త గంగారాం, మరో ముగ్గురితో కలిసి తిరుపతి అనే దళిత వ్యక్తిపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు అతడిని ఈడ్చుకుంటూ వెళ్లి దారుణంగా కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దళితుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
DNB News