Tuesday, 04 August 2026 01:06:32 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే

Date : 11 April 2026 03:58 PM Views : 62

DNB News - తెలంగాణ / : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే అని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పాల్గొని, జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేడు మహనీయుడు జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ కాలంలో కుల, మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి, ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆ రోజుల్లో కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను పూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. అందుకే వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నా మని అన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిసి వర్గానికి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని, బీసీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే బోధించిన సిద్ధాంతాలని తెలిపారు. ఆ కాలంలోనే మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని గుర్తుచేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా వారి ఆశయాలను మరోసారి స్మరించుకొని, మంచి సమాజ నిర్మాణం కోసం వారు చూపిన మార్గంలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సాంస్కృతిక సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :