Saturday, 19 September 2026 06:46:48 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఔషధ రంగంపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యాన్ని అడ్డుకుందాం

Date : 22 May 2026 10:47 AM Views : 80

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం: ఫార్మసీ రక్షణ కోసం, ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కోసం దేశవ్యాపితంగా చేపట్టిన మెడికల్ షాపుల బందులో భాగంగా కొత్తగూడెం కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గణేష్ టెంపుల్ ఏరియాలో నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నిరసన శిబిరాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సందర్శించి, బంద్‌కు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్లే నేడు మెడికల్ షాపుల యజమానులు రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల స్థానిక వ్యాపారుల జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా, నకిలీ మందుల సరఫరా పెరిగి ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్న చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఫార్మసీ రంగాన్ని, చిన్న వ్యాపారులను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ పోరాటం ఎంతో న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మెడికల్ అసోసియేషన్ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :