DNB News - తెలంగాణ / : మునగాల:మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పరిశీలించి రైతులు తప్పనిసరిగా ధాన్యంలో తాలు,తప్పలేకుండా, తేమశాతం 17 లోపు ఉండేలాగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావాల్సిందిగా సూచించారు. వచ్చిన రైతులను సీరియల్ ప్రకారం రిజిస్టర్ నమోదు చేసుకుంటూ,ప్రతిరోజు తప్పనిసరిగా తేమశాతాన్ని పరీక్షిస్తూ, నాణ్యత తేమశాతం కలిగిన రైతుల ధాన్యాన్ని వెంటనే కాంటాలు జరిపి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి రాజు, ఆకుపాముల వ్యవసాయ విస్తరణ అధికారి మహిత, సెంటర్ నిర్వాహకులు గోపి,రైతులు పాల్గొన్నారు.
Admin
DNB News