DNB News - తెలంగాణ / : ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో విస్తరించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 104 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. Hyderabad Cyber Crime Police ఆధ్వర్యంలో 32 ప్రత్యేక బృందాలు పది రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించాయి. బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ కాల్స్, OTP ఫ్రాడ్స్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ వంటి కేసుల్లో పాల్గొన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కొంతమంది బ్యాంక్ అధికారులూ ఉండటం కలకలం రేపుతోంది. పోలీసులు నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులపై స్పందించకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
Admin
DNB News