Friday, 18 September 2026 05:19:52 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

Date : 17 April 2026 09:50 AM Views : 79

DNB News - తెలంగాణ / : కరీంనగర్ నగరంలో కిసాన్ నగర్ బస్తీలో చత్రపతి శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. గోపూజతో కార్యక్రమం అనంతరం హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళన కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ ప్రచార ప్రముఖ్ తడి గొప్పల శంకరయ్య మాట్లాడుతూ సమాజంలో కులాల పేరుతో పెరుగుతున్న విభజన తో హిందువులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని , హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం , ధర్మం సుస్థిరంగా ఉంటుందన్నారు. ఐకమత్యత లేని కారణంగా నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. హిందువులు ఐక్యంగా, సంఘటితశక్తిగా మారాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. హిందూ ధర్మం ఎంతో గొప్పదని,. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరు దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలని సూచించారు. హిందూల ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చిన మేరకు హిందూ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు దేశం, ధర్మం, సంస్కృతి , సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరయంగా పని చేసిందన్నారు. నేడు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్ధన్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిందన్నారు. సంఘం దేశహితం కోసం ఎల్లవేళలా పనిచేస్తూ ముందు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర సేవికాసమితి ప్రాంత శారీరక్ ప్రముక్ లెక్కల రమ మాట్లాడుతూ హిందూ ధర్మం ఎంతో పురాతనమైనదని, హిందూ ధర్మం విశిష్టమైన చరిత్ర కలిగి ఉందన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. సనాత ధర్మ పరిరక్షణ మనందరికీ శ్రీరామరక్ష లాంటిదన్నారు. అనంతరం. ముఖ్యఅతిథిగా హాజరైన మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సమ్మేళనము కార్యనిర్వహణ సమితి అధ్యక్షుడు పసుల మహిపాల్ ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ జన జాగరణ సమితి అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి మేంగని రాజయ్య ఉపాధ్యక్షులు ఉప కార్యదర్శులు బస్తీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: