DNB News - తెలంగాణ / : మునగాల:ప్రజలకు చట్టాల గురించి వివరించడం శాంతి యుత సమాజం కోసం, శాంతియుత గ్రామం కోసం జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మునగాల పోలీసులు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో మునగాల పోలీసులు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి హాజరై చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రజలు అందరు కలిసిమెలిసి ఉండాలి, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, జీవితంలో తప్పటడుగు వేస్తే మళ్ళీ సరిదిద్దుకోవటం చాలా కష్టం అవుతుంది అని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు, జాగ్రత్తగా వాహనాలు నడపాలి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించాలి, పెద్ద వాహనాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని డిఎస్పీ అన్నారు. చదువు విలువను గుర్తించాలి, యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదువుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అన్నారు. తప్పులు, నేరాలకు పాల్పడితే చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి అనేది చట్టం రూపొందించారు, చట్టానికి లోబడి నడుచుకోకపోతే, క్షణికావేశంలో, క్షేణిక అందంకోసం తప్పులు, నేరాలు చేస్తే జీవితకాలం జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అన్నారు. తగాదాలు, గొడవలు ఉంటే చట్టపరిధిలో పరిష్కరించుకోవాలి అన్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ళకు చిక్కితే ఆర్థికంగా లూటీ చేస్తారు, తక్కువ వడ్డీకి లోన్ వచ్చినది ప్రాసేసింగ్ ఫీజు కట్టాలి అంటే నమ్మి డబ్బులు చెల్లించవద్దు, మీరు డ్రగ్స్ కేసులో, ఇతర డిజిటల్ కేసులో చిక్కుకున్నారు అని CBI, CID పోలీస్ అధికారులం మాట్లాడుతున్నాను మిమ్ములను అరెస్టు చేస్తాము అని బయపెడతారు, కేసు నుండి తప్పిస్తం డబ్బులు కట్టాలి అంటారు భయపడి డబ్బులు కట్టవద్దు డిజిటల్ అరెస్టు అనేది అబద్ధం అన్నారు. నేరాల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో విదేశాలకు వెళ్లే విషయంలో పై చదువుల విషయంలో సమస్యలు వస్తాయి. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలి, అజాగ్రత్తగా మద్యం మత్తులో, అధిక వేగం తో, నిర్లక్ష్యంగా వాహనాలు తొలడం వల్ల రోడ్డు ప్రమాదాల జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోగొట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతుంది అన్నారు. జాగ్రత్తగా ఉండాలి చట్టానికి లోబడి ఉండాలి, సమస్యలు వస్తె సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పోలీసులను, అధికారులను ఆశ్రయించాలి, చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి, బైండోవర్ చేస్తాము, షీట్ నమోదు చేస్తాము అన్నారు. సామాజిక అంశాలపై పోలీసు కళాబృందం వారు సామాజిక అంశాల పట్ల ఆట పాటలతో అవగాహన కల్పించారు.
Admin
DNB News