DNB News - తెలంగాణ / : కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో గల సెయింట్ పాల్స్ హై స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ లీనా ప్రియదర్శిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు సాగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవరుచుకోవాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు, 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం, 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గంట శ్రీనివాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్యాల సుజిత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News