Monday, 03 August 2026 12:36:34 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

సేవ్ తెలంగాణ....ఓట్ ఫర్ బీజేపీ

Date : 10 February 2026 10:45 AM Views : 89

DNB News - తెలంగాణ / : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనకు చెంప పెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు ద్వారా అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘సేవ్ తెలంగాణ...ఓట్ ఫర్ బీజేపీ’’అనే బీజేపీ నినాదానికి అనుగుణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమన్నారంటే... ప్రజలారా! రేపు జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెలంగాణలో మార్పుకు సంకేతం కావాలి. అవినీతి, అరాచకాలు, మోసపూరిత హామీలతో అడ్డగోలు పాలన చేస్తున్న కాంగ్రెస్ పాలకులకు చెంప పెట్టు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఏం చేసారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసపెట్టడానికి ప్రయత్నించారు. బీజేపీ మాత్రమే స్పష్టమైన ఎజెండాతో, స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణతో ఎన్నికల్లో పాల్గొంటోంది. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధులవల్లేనని గుర్తుంచుకోండి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదు. ఇప్పుడు ప్రజల ముందున్న దారి ఒక్కటే. అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీకి బలమైన హెచ్చరిక జారీ చేయాలి. తెలంగాణను దోచుకుతిన్న బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మొలవకుండా బొందపెట్టాలి. ప్రజలారా.... తస్మాత్ జాగ్రత్త..! బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను నమ్మితే అధో:గతే. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, మున్సిపాలిటీల్లో నిజమైన పాలన రావాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలంటే.. కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బిజెపి.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :