DNB News - తెలంగాణ / : మంత్రి పొంగులేటి సన్నిహితులు జూపల్లి రమేష్–శశికళ దంపతుల నామినేషన్లు సిపిఎం నేతల మద్దతుతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో జూపల్లి దంపతులు నామినేషన్ వేశారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకులు జూపల్లి రమేష్, శశికళ దంపతులు అశ్వారావుపేట మున్సిపాలిటీలో రెండు వార్డులకు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నామినేషన్ దాఖలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Admin
DNB News