Monday, 16 March 2026 03:49:11 PM
# ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ # సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం ఆస్పత్రిలో చికిత్స

25 న ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్.

లైవ్ ఇవ్వనున్న డి యన్ బి న్యూస్ ఛానెల్

Date : 23 January 2026 02:56 PM Views : 247

DNB News - తెలంగాణ / ఖమ్మం : 8 రాష్ట్రాల నుంచి హాజరుకానున్న సీనియర్ మహిళ క్రికెటర్లు.. ఈనెల 25 న ఖమ్మంలో సీనియర్ ఉమెన్ టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభo. ఖమ్మంలో క్రికెట్ క్రీడాభిమానులను ఆలరించనున్న ఇందిరాగాంధీ ఐదవ సీనియర్ ఉమెన్ టి20 క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్.. జాతీయస్థాయి మహిళ క్రికెట్ పోటీల నిర్వహణ ఖమ్మం జిల్లాలో నిర్వహించుకోవడం తెలంగాణ సంప్రదాయంగా పరిడవిల్లుతోందని ఈనెల 25వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏడు రోజులపాటు జాతీయస్థాయి ఇందిరాగాంధీ 5వ సీనియర్ ఉమెన్ టి-20క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్ లో సీనియర్ మహిళా క్రీడా మణులు 08 రాష్ట్రాల నుంచి హాజరు కాబోతున్నారని, ఐ.ఎన్ టీ యూ సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు, ప్రముఖ టోర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ మతిన్, ఆల్ ఇండియా ఉమెన్ టి 20 క్రికెట్ అసోసియేషన్ (ఏ డబ్ల్యు టి సి ఏ ) డైరెక్టర్ సందీప్ ఆర్య లు అన్నారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం క్రికెట్ నెట్ మైదాన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. *మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ మైదానం ఇప్పటికే ముస్తాబు అయిందని వారన్నారు. ఇప్పటికే క్రీడా పోటీల నిర్వహణ కోసం పలువురు దాతలు ముందుకు రావడం శుభ సూచికం అని, వారికి త తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇందిరాగాంధీ 5 వ సీనియర్ ఉమెన్ టి20 క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్ లో భాగంగా వీక్షకుల కోసం డి.ఎన్. బి. న్యూస్ ఆధ్వర్యంలో నాలుగు కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలు ఉండబోతున్నాయన్నారు. ఈ టోర్నమెంట్లో 8 రాష్ట్రాల నుంచి సీనియర్ మహిళ క్రీడామణులు పాల్గొన నున్నారని చెప్పారు. , ఢిల్లీ, ఉత్తర్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రాల సీనియర్ మహిళా క్రీడామణులు హాజరుకానున్నారన్నారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరం లో జాతీయ స్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్ జరగడం రాష్ట్ర నికి గర్వ కారణం అన్నారు మహిళా లు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాదించాలి అన్న రు. క్రికెట్ క్రీడా లో అపార అనుభవం కలిగిన మహమ్మద్ మతీన్ నేతృత్వంలో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణలో చాకచక్యంగా క్రీడా పోటీలను విజయ పదంలో నడిపి, అపార అనుభవంతో ఈ క్రీడా పోటీలను మతీన్ జరుపనున్నారని పేర్కొన్నారు. మహిళా క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో మహిళ ఎంపైర్లతోనే క్రికెట్ క్రీడా పోటీల నిర్వహణ ఉండబోతుందన్నారు. మహిళా క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఖమ్మంలో క్రికెట్ క్రీడాభిమానులను ఇందిరాగాంధీ 5 వ సీనియర్ ఉమెన్ టి20 క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్ అలరించబోతుందన్నారు. అనంతరం టోర్నమెంట్ బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఉర్దూగర్ షాది ఖానా చైర్మన్ షేక్. మజీద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఫరీద్ ఖాద్రి, సీనియర్ క్రీడాకారుడు ఖాజా, ఇందిరా ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ సిరంశెట్టి వేణు, మహిళా సీనియర్ క్రీడాకారిణి సుభద్ర, పి శ్రీలక్ష్మి, ఆర్గనైజర్లు వీరేందర్, సిద్దు, నాగేశ్వరరావు, అఫిషియల్ అంపైర్స్ నైనా, ప్రియ, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :