DNB News - తెలంగాణ / : ప్రయాణికుల భద్రతను విస్మరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. 'ఒకే దేశం, ఒకే విధానం' పేరుతో అమలులో ఉన్న ఆల్ ఇండియా పర్మిట్ల విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కడ తిరుగుతాయో అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు పొందాలని స్పష్టం చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం తగ్గడంతో పాటు, బస్సుల భద్రతా ప్రమాణాలు మెరుగుపడి ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
Admin
DNB News