Sunday, 02 August 2026 09:26:04 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఘనంగా జ్యోతిరావు పూలే, జ్ఞానసూర్యుడు అంబేడ్కర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు

Date : 30 May 2026 11:20 AM Views : 45

DNB News - తెలంగాణ / : సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ మరియు భారతదేశ మార్పు కోసం సామాజిక సేవ చేసిన పలువురికి "జ్యోతిరావు పూలే - జ్ఞానసూర్యుడు అంబేడ్కర్" అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హైకోర్టు అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ బట్టు శ్రీనివాస్, ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఫోరమ్ అధ్యక్షులు షేక్ ఇస్లాముద్దీన్, మరియు హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మంగళపెల్లి హుస్సేన్ హాజరయ్యారు.ముఖ్య అతిధుల ప్రసంగం:ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చాం అనేదే ముఖ్యం" అనే గొప్ప భావనతో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాలను జరిపామని, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ లాంటి పెద్ద జిల్లాలో ఈ వేడుకలను నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.సమాజంలో ప్రతి ఒక్కరికీ మానవ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండాలని వారు పేర్కొన్నారు. సమాజ మార్పు కోసం, న్యాయం కోసం నిరంతరం శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను, వారి జీవిత విశేషాలను నేటి తరం తప్పక తెలుసుకోవాలని మరియు వారి అడుగుజాడల్లో నడవాలని అతిథులు ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో అవార్డు గ్రహీతలు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో మిట్టపెల్లి రాజు కుమార్, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్, పొన్నల తిరుపతి,స్టేట్ ఎగ్జిట్వ్ మెంబెర్,జట్టు పల్లి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు, కాల్వ మధుబాబు,కరీంనగర్ జిల్లా కో ఆర్డినేటర్,పొన్నాల శంకర్,వైస్ ప్రెసిడెంట్, కుంట సుజాత, జాయింట్ సెక్రటరీ, వొగెటి సుహాసిని, ప్రెసిడెంట్, కరింగుల సుజాత, జనరల్ సెక్రటరీ,తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :