Friday, 17 April 2026 05:10:35 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

కల్లూరు ఏసీపీ కార్యాలయం ఖమ్మం.

Date : 08 April 2026 06:26 PM Views : 15

DNB News - తెలంగాణ / : కల్లూరు ఏసీపీ కార్యాలయం ఖమ్మం... *నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు ఇప్పటికే అరెస్టు కాగా పరారీలో ఉన్న A2 శ్రీపాధి మౌనిక అరెస్ట్ : కల్లూరు ఏసీపీ ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఏన్కూర్ శాఖలో 2024 సంవత్సరంలో జరిగిన గోల్డ్ లోన్ మోసం కేసులో, ఈ రోజు నిందితురాలు శ్రీపాది మౌనిక (A2)ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు శ్రీపాది సతీష్ (A1), రామచంద్రోజు జయమ్మ (A3), రామచంద్రోజు నరేష్ (A4)లను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏన్కూర్ శాఖ బ్రాంచ్ మేనేజర్ శ్రీ కె.వి. ప్రశాంత్ రెడ్డి గారు ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే కేసు నమోదు చేసి వేగవంతంగా దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శ్రీపాది సతీష్ (A1) తన భార్య శ్రీపాది మౌనిక (A2), సతీష్ అత్తగారు రామచంద్రోజు జయమ్మ (A3), సతీష్ బావమరిది శ్రీ రామచంద్రోజు నరేష్ (A4) లతో కలిసి సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి మొత్తం రూ. 9,53,000/- గోల్డ్ లోన్లు పొందినట్లు విచారణలో నిర్ధారించబడింది. లోన్లు చెల్లించకపోవడంతో ఖాతాలు NPAగా మారగా, బ్యాంకు వారు నిర్వహించిన వేలంలో ఆభరణాలు నకిలీవని గుర్తించబడింది. దర్యాప్తులో మరింతగా తెలిసినదేమనగా, గతంలో ఏన్కూర్ లో శ్రీపాది సతీష్ (A1) మరియు రామచంద్రోజు నరేష్ (A4) లు కలిసి “మౌనిక జ్యువలరీ షాప్” పేరుతో వ్యాపారం నిర్వహిస్తూ కొంతమంది ప్రజలను మోసం చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.ఈ విషయం పై అందిన ఫిర్యాదుల పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు తీసుకునే సమయంలో నకిలీ ఆభరణాలు వినియోగిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. ఎవరైనా ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పని ఏసీపీ అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :