Friday, 18 September 2026 05:18:00 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం

Date : 16 April 2026 03:36 PM Views : 111

DNB News - తెలంగాణ / : మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామం వద్ద గల మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" ప్రచారంలో భాగంగా అవగాహన కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్. చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది - జిల్లా కలక్టర్. రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రామిస్ తీసుకోవాలి - జిల్లా ఎస్పి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా, మునగాల మండలంలోని ఆకుపాముల వద్ద గల మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చే రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు, పాఠశాల బస్సు డ్రైవర్ల కు, ఉపాధ్యాయులకు, విలేకరులకు హెల్మెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన ప్రజ్ఞ స్కూల్, గాయత్రి స్కూల్ పిల్లలు, ఉపాద్యాయులు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి కలక్టర్ మాట్లాడుతూ చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి, నష్టానికి కారణం అవుతుంది అన్నారు, నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు అన్నారు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, తమ ఇంట్లోని పెద్దలకు, పక్కింటి వారికీ మరియు తమ స్థానిక ప్రాంతాల్లో ని వ్యక్తులకు రోడ్డు భద్రత నియమాల గురించి తెలియజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, పోలీస్ శాఖ, రవాణా శాఖ, ఇతర శాఖలు సంయుక్తంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చేతులు బయట పెట్టవద్దు. రోడ్డు నియమాలు పాటించేలా పిల్లలు తల్లిదండ్రులకు తెలపాలి, రోడ్డు భద్రత నియమలపై స్కూల్ లో పాఠాలు చెప్పాలని స్కూల్ అధికారులను కలక్టర్ ఆదేశించారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరారు. ప్రయాణ సమయంలో తీసుకునే జాగ్రత్తలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేరుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని, వారి కుటుంబ సభ్యులు వారి కోసం ఇంట్లో ఎదురుచూస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. రేపటి దేశ భవిష్యత్తు నేటి విద్యార్థులే పునాదులు. ప్రస్తుత సమాజంలో చాలా మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. పిల్లలు పాఠశాలకు వెళ్ళేటప్పుడు స్కూల్ బస్సు ఎక్కడం దిగడం చేస్తుంటారు, బస్సులో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటారు అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు వాహనాలపై బయటకు వెళ్ళేటప్పుడు ద్విచక్రవాహనాలు హెల్మెట్ ధరించాలి, కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ పెట్టుకునేలా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయాలి ప్రామిస్ తీసుకోవాలని అన్నారు. రోడ్లు దాటేటప్పుడు ఇండికేటర్ వేసుకోవాలి, చేయి ఎత్తి అవతలి వాహనాలకు సూచన చేయాలి అని చెప్పండి, రోడ్డుపై యడమ వైపున ప్రయాణించాలి అని చెప్పండి అన్నారు. నియమాలు పాటిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే సురక్షితంగా గమ్యం చేరుతారు. తల్లిదండ్రులలో, అన్నలతో, బంధువులతో ప్రామీస్ తీసుకోవాలి, ఉత్తరాలు రాయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ జిలానీ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్, ఎస్ఐ అజయ్, స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు, ప్రజ్ఞ స్కూల్, గాయత్రి స్కూల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: