Saturday, 01 August 2026 07:13:43 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక..

Date : 27 April 2026 05:58 PM Views : 71

DNB News - తెలంగాణ / : పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నారాయణమూర్తి పెట్రోల్ బంక్, అమ్మ హాస్పిటల్ సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్, గుత్తి పెట్రోల్ బంక్‌లను కలెక్టర్, ఎస్పీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకులు ఉన్నాయని తెలిపారు. ప్రతి బంక్ వద్ద వీఆర్‌ఓలు పర్యవేక్షణ నిర్వహిస్తూ పెట్రోల్ లోడ్ వివరాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్‌తో వచ్చి పెట్రోల్ తీసుకెళ్లకుండా షాపు యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గత మూడు రోజులుగా జనసందోహం తగ్గుముఖం పట్టిందని, ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేసి 150 లీటర్ల డీజిల్, 200 లీటర్ల పెట్రోల్ సీజ్ చేసినట్లు తెలిపారు. HPCL తదితర ఆయిల్ కంపెనీలతో చర్చించి సాయంత్రానికి 95–100 లోడ్లు అందుబాటులోకి వస్తాయని, దీంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్పారు. అనంతరం వాహనదారులతో మాట్లాడిన కలెక్టర్, ఎటువంటి కొరత లేదని, అపోహలకు లోనవకుండా అవసరానికి సరిపడేంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూలను నియంత్రించేందుకు ఇప్పటికే తగిన పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ రాజా రఘువీర్, సివిల్ సప్లైస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: