DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండలంలోని పైనంపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం నుండి గ్రామంలోని సైడ్ కాలువలలో చెత్త పేరుకుపోయి మురికి నీళ్లు నిలువ ఉండటం వలన కంపు వాసన వస్తున్న తరుణంలో నూతన సర్పంచి దారావత్ సరోజిని శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాల్వలలోని పూడిక వెలికితీంచి దుర్వాసన రాకుండా.. ప్రజలకు అంటువ్యాధులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు అదేవిధంగా గ్రామంలోని వీధిలైట్లు లేక చీకటిమయం అయిన గ్రామాన్ని కొత్తగా వీధిలైట్లు వేయించి గ్రామాన్ని వెలుగులతో ఉంచుతున్నారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా ఎక్కడికక్కడ పైపులైన్లను బిగించారు ఇలా చెప్పుకుంటూ పోతే గత రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడు వీరు వచ్చాక మా యొక్క సమస్యలు తీరిపోయాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Admin
DNB News